ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనేది పురుషుల ట్వంటీ20 (T20) క్రికెట్ లీగ్. దీన్ని భారతదేశంలో ఏటా నిర్వహిస్తారు. పది నగరాలకు చెందిన ఫ్రాంచైజీ జట్లు ఇందులో పోటీ చేస్తాయి. [1] దీనిని స్పాన్సర్‌షిప్పును అనుసరించి దీన్ని టాటా IPL అని కూడా పిలుస్తారు. 2007 లో బీసీసీఐ ఈ లీగ్‌ని స్థాపించింది. పోటీలు సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవిలో మార్చి, మే నెలల్లో జరుగుతాయి. ఈ సీజనులో ప్రపంచవ్యాప్తంగా తక్కువ అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు జరుగుతున్నందున ICC ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో దీనికి ప్రత్యేకమైన విండో ఉంది.[2]
ఐపిఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. 2014లో, సగటు హాజరు ప్రకారం చూస్తే స్పోర్ట్స్ లీగ్‌లన్నిటిలోకీ ఇది ఆరవ స్థానంలో ఉంది. [3] 2010లో, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన మొదటి క్రీడా ఈవెంట్‌గా IPL నిలిచింది. [4][5] IPL భారీ విజయం నుండి స్ఫూర్తిగా అనేక దేశీయ క్రికెట్ లీగులు, ఇతర క్రీడల లీగ్‌లూ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. [a][8][9][10] 2022లో ఈ లీగ్ బ్రాండ్ విలువ రూ 90,038 కోట్లు [11] BCCI ప్రకారం, 2015 సీజనులో ఐపిఎల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ జిడిపికి రూ 1,150 కోట్లు అందించింది.[12] కన్సల్టింగ్ సంస్థ డి అండ్ పి అడ్వైజరీ నివేదిక ప్రకారం, 2022 డిసెంబరులో IPL విలువ US$10.9 బిలియన్లు. 2020 నుండి డాలర్ పరంగా 75% వృద్ధిని నమోదు చేసింది.[13] 2023 ఐపిఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది వీక్షకులు చూసారు. ఇంటర్నెట్‌లో అత్యధిక వీక్షణలు పొందిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అది.[14]
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ అందించిన నిధులతో ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL)ను 2007లో స్థాపించారు. [18] ICL ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) గాని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గానీ గుర్తించలేదు. BCCI కమిటీ సభ్యులు ICL ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేరడం దానికి అసంతృప్తి కలిగించింది. [19] ఆటగాళ్లు ICLలో చేరకుండా నిరోధించడానికి, BCCI తన దేశీయ టోర్నమెంట్‌లలో ప్రైజ్ మనీని పెంచింది. BCCI రెబల్ లీగ్‌గా పరిగణించిన ICLలో చేరే ఆటగాళ్లపై జీవితకాల నిషేధాన్ని విధించింది. [20][21]
2007 సెప్టెంబరు 13 న,[22] 2007 T20 ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన తరువాత, [23] BCCI, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఫ్రాంచైజీ ఆధారిత ట్వంటీ20 క్రికెట్ (T20) పోటీని ప్రకటించింది. మొదటి సీజన్ 2008 ఏప్రిల్‌లో న్యూ ఢిల్లీలో "హై-ప్రొఫైల్ వేడుక"లో ప్రారంభం కావాల్సి ఉంది. IPL ప్రయత్నానికి నాయకత్వం వహించిన BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ, టోర్నమెంట్ ఫార్మాట్, ప్రైజ్ మనీ, ఫ్రాంచైజీ ఆదాయ వ్యవస్థ, స్క్వాడ్‌ల కూర్పు నియమాలతో సహా వివిధ వివరాలను ప్రకటించాడు. ఐపిఎల్‌ను మాజీ భారత ఆటగాళ్లు, బిసిసిఐ అధికారులతో కూడిన ఏడుగురు వ్యక్తుల గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహిస్తుందనీ, రెండు అగ్రశ్రేణి ఐపిఎల్ జట్లు ఆ సంవత్సరం ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 కి అర్హత సాధిస్తాయనీ కూడా ప్రకటించారు. 2007లో స్థాపించబడిన ప్రైవేట్ T20 లీగ్ అయిన ఇండియన్ క్రికెట్ లీగ్‌కు పోటీగా IPL ను ప్రారంభించలేదనీ, BCCI [22] అనేక సంవత్సరాలుగా ఈ ఆలోచనపై పనిచేస్తోందనీ కూడా మోడీ చెప్పాడు. లీగ్ ఫార్మాట్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, అమెరికా లోని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మాదిరిగానే ఉంది. [21] మోడీ, "ఐపిఎల్ పూర్తిగా కొత్త తరం క్రీడాభిమానులను దేశవ్యాప్తంగా మైదానంలోకి ఆకర్షించడానికి రూపొందించబడింది. డైనమిక్ ట్వంటీ 20 ఫార్మాట్ మహిళలు, పిల్లలతో సహా యువ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించాం." అని చెప్పాడు. [22]
కొత్త లీగ్‌లో పాల్గొనే జట్టు యజమానులను ఎంచుకోవడానికి, 2008 జనవరి 24 న ఫ్రాంచైజీల వేలం నిర్వహించారు; ఫ్రాంఛైజీల రిజర్వ్ ధరలు సుమారు $400 మిలియన్లు. [21] వేలం ముగింపులో, గెలుపొందిన బిడ్డర్లు, జట్లు ఉండే నగరాలు: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, మొహాలీ, ముంబై . [21] ఫ్రాంచైజీలను మొత్తం $723.59 మిలియన్లకు విక్రయించారు. [24]ICL లో పాల్గొనే ఆటగాళ్లపై విధించిన నిషేధం ఫలితంగా, 2009 లో అది మూతపడింది. [25][26]
2010 మార్చి 21 న, కొత్త ఫ్రాంఛైజీలు పూణె వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ లు 2011 లో నాల్గవ సీజన్‌కు ముందు లీగ్‌లో చేరాయి. [29] సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ గ్రూప్ $370 మిలియన్లకు పూణే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. రెండెజౌస్ స్పోర్ట్స్ వరల్డ్ కొచ్చి ఫ్రాంచైజీని $333.3 మిలియన్లకు కొనుగోలు చేసింది.[29] కొచ్చి టస్కర్స్ కేరళ 2011 సీజన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీకి చెందిన 10% బ్యాంక్ గ్యారెంటీ ధనాన్ని BCCI కి చెల్లించడంలో విఫలమైనందున 2011 నవంబరు 11 న దాన్ని రద్దు చేసారు.[30]
2012 సెప్టెంబరు 14 న, 2009 ఛాంపియన్ అయిన డెక్కన్ ఛార్జర్స్‌కు కొత్త యజమానులు దొరకలేదు. BCCI ఆ జట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. [31] అక్టోబరు 25న, కొత్త ఫ్రాంచైజీ కోసం వేలం నిర్వహించగా, హైదరాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన బిడ్‌ను సన్ టీవీ నెట్‌వర్క్ గెలుచుకుంది. [32] జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు. [33]
BCCIతో ఆర్థిక విభేదాల కారణంగా పూణె వారియర్స్ ఇండియా 2013 మే 21 న IPL నుండి వైదొలిగింది. [34] BCCI అధికారికంగా ఫ్రాంచైజీని 2013 అక్టోబరు 26 న రద్దు చేసింది. అవసరమైన బ్యాంక్ గ్యారెంటీని అందించడంలో విఫలమైనందున రద్దు చేసారు. [35]
COVID-19 మహమ్మారి కారణంగా, 2020 సీజన్‌కు వేదికను మార్చి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో గేమ్‌లు నిర్వహించారు. [39][40] 2012 ఆగస్టులో, BCCI రెండు కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది. ఇది BCCI షార్ట్‌లిస్ట్ చేసిన ఆరు నగరాల్లో రెండింటిలో ఉంటాయి. అవి – అహ్మదాబాద్, లక్నో, కటక్, గౌహతి, రాంచీ, ధర్మశాల – 2022 సీజన్ నుండి అవి లీగ్‌లో చేరతాయని ప్రకటించింది. [41][42] అక్టోబరు 25 న జరిగిన క్లోజ్డ్ బిడ్డింగ్‌లో, RPSG గ్రూప్, CVC క్యాపిటల్‌లు జట్ల కోసం బిడ్‌లను గెలుచుకున్నాయి. RPSG రూ 7,000 కోట్లతో లక్నో, CVC 5,200 కోట్లతో అహ్మదాబాద్‌ను గెలుచుకున్నాయి. [43][44] ఈ జట్లకు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అని పేర్లు పెట్టారు.
అనేక మంది IPL జట్టు యజమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లీగ్‌లలో దక్షిణాఫ్రికాకు చెందిన SA20, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) వంటి జట్లను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని విస్తరించారు. వారు తమ జట్లను తమ ఐపిఎల్ జట్లకు సమానమైన పేర్లతో బ్రాండింగు చేసుకున్నారు. [45]
IPL ప్రధాన కార్యాలయం ముంబైలోని చర్చ్‌గేట్‌లోని వాంఖడే స్టేడియం పక్కన క్రికెట్ సెంటర్‌లో ఉంది. టోర్నమెంట్ సంస్థతో సహా లీగ్ విధులకు IPL గవర్నింగ్ కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది. దీని సభ్యులు: [46]
ఏటా జరిగే ఆటగాళ్ళ వేలంలో పాడుకోవడం, ట్రేడింగ్ సమయంలో ఇతర జట్ల నుండి కొనుక్కోవడం, అందుబాటులో లేని ఆటగాళ్ళ స్థానంలో వేరేవాళ్ళను తీసుకోవడం ద్వారా జట్టు ఆటగాళ్లను సమకూర్చుకుంటుంది. ఆటగాళ్ళు వేలం కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటరు. [49] తమ మూల ధరను నిర్ణయించుకుంటారు. అత్యధిక-బిడ్డింగ్ చేసిన ఫ్రాంచైజీ, వారిని కొనుగోలు చేస్తుంది. వేలంలో విక్రయించబడని ఆటగాళ్లు అందుబాట్యులో లేని ఆటగాళ్ళ స్థానంలో (భర్తీ) చేరడానికి అర్హులు. ట్రేడింగ్ విండోస్‌లో, ఆటగాడి సమ్మతి ఉంటేనే వర్తకం చేయవచ్చు; ఫ్రాంఛైజీ పాత కొత్త ఒప్పందాల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే దాన్ని చెల్లిస్తుంది. కొత్త కాంట్రాక్టు విలువ పాతదాని కంటే ఎక్కువ ఉంటే, ఆటగాడు, అమ్మే ఫ్రాంచైజీ ఆ తేడాను పంచుకుంటారు. సాధారణంగా మూడు ట్రేడింగ్ విండోలు ఉంటాయి - వేలానికి ముందు రెండు ఉండగా, వేలానికి టోర్నమెంటు ప్రారంభానికీ మధ్య ఒకటి ఉంటుంది. ట్రేడింగ్ విండోస్ వెలుపల లేదా టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్ళ వర్తకం చేయకూడదు. అయితే టోర్నమెంట్‌కు ముందు లేదా జరిగే సమయంలో భర్తీ ఆటగాళ్ళను తీసుకోవచ్చు.
2020 సీజన్ నాటికి ఫ్రాంచైజీల నియమాలు కొన్ని:
మొత్తం స్క్వాడ్ జీతం రూ 85 కోట్లను మించకూడదు . [50]
అండర్-19 ఆటగాళ్ళలో ఇంతకు ముందు ఫస్ట్-క్లాస్ లేదా లిస్ట్ A క్రికెట్ ఆడితే తప్ప వారిని ఎంపిక చేయకూడదు. [51]
ఆటగాళ్ళ కాంట్రాక్టులు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. ఒప్పందాన్ని ఫ్రాంచైజీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు. 2014 సీజన్ నుండి, ప్లేయర్ కాంట్రాక్ట్‌లు రూపాయిల్లో ఇస్తున్నారు. అంతకు ముందు ఒప్పందాలు US డాలర్లలో ఉండేవి. విదేశీ ఆటగాళ్ళ కాంట్రాక్ట్ తేదీ నాటి లేదా అసలు చెల్లింపు తేదీ నాటి మారకం రేటును బట్టి ఆటగాడు ఎంచుకున్న కరెన్సీలో వేతనం పొందవచ్చు. [52] 2014 సీజన్‌కు ముందు, ఆటగాళ్ళ వేలం పూల్‌లో భారత దేశీయ ఆటగాళ్లను చేర్చలేదు. వారిని ఫ్రాంచైజీలు నేరుగా విడివిడిగా సైన్ అప్ చేసుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీ ఇచ్చే జీతం నుండి ఒక్కో ఆటగాడికి 10 లక్షల నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తారు. దీన్ని ఫ్రాంచైజీ యజమానులు గట్టిగా వ్యతిరేకించారు. బాగా డబ్బున్న ఫ్రాంఛైజీలు "లోపాయికారీ ఒప్పందాలతో ఆటగాళ్లను ఆకర్షిస్తున్నాయి" అని వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలంలో దేశీయ ఆటగాళ్లను చేర్చాలని ఐపీఎల్ నిర్ణయించింది. [53]
విదేశీ ఆటగాళ్ల జీతంలో 10% మొత్తాన్ని బిసిసిఐ, ఆయా దేశాల జాతీయ క్రికెట్ బోర్డులకు ఇస్తుంది. [54]
స్పోర్టింగ్ ఇంటెలిజెన్స్, ESPN ది మ్యాగజైన్ లు 2015 లో చేసిన సర్వే ప్రకారం, ప్రో-రేటింగ్ పద్ధతిలో చూస్తే, IPL లో ఆటగాళ్ళ సగటు జీతం సంవత్సరానికి US$ 4.33 మిలియన్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోని స్పోర్ట్స్ లీగ్‌లు ఇచ్చే అత్యధిక జీతాల్లో రెండవ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆటగాళ్లు టోర్నమెంట్ వ్యవధికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇది రెండు నెలల కన్నా తక్కువ. కానీ, ఇతర స్పోర్ట్స్ లీగ్‌లు కుదుర్చుకునే ఒప్పందాలు మొత్తం సంవత్సరానికి ఉంటాయి.[55]
ది టెలిగ్రాఫ్ యొక్క నివేదిక ప్రకారం, IPL లో వచ్చే ఆదాయంలో ఆటగాళ్లకు 18% చెల్లిస్తారు. ఇది ఇతర ప్రధాన స్పోర్ట్స్ లీగ్‌లతో పోలిస్తే అతి తక్కువ మొత్తం. చాలా స్పోర్ట్స్ లీగ్‌లు తమ ఆదాయంలో ఆటగాళ్లకు కనీసం 50% చెల్లిస్తాయి. ఐపీఎల్ ఆటగాళ్లకు సక్రమంగా చెల్లించాలని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య తెలిపింది.[56][57][58]
IPL 2022 సీజన్లో మొత్తం 46.5 కోట్లు ప్రైజ్ మనీ ఉంది. విజేత జట్టు 20 కోట్లు, రెండవ స్థానంలో నిలిచిన జట్టు 13 కోట్లు, మూడవ స్థానంలో నిలిచిన జట్టు 7 కోట్లు, నాల్గవ స్థానంలో ఉన్న జట్టు 6.5 కోట్లు అందుకుంటాయి.[59][60] ఇతర జట్లకు ప్రైజ్ మనీ ఉండదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రైజ్ మనీలో సగం మొత్తాన్ని ఆటగాళ్లకు పంచాలి.[61]
అంతర్జాతీయ T20 క్రికెట్ ఫార్మాట్‌కు, ఇతర T20 లీగ్‌లకూ భిన్నంగా IPL లో కొన్ని నియమాలున్నాయి. అవి:
IPL గేమ్‌లలో టెలివిజన్ టైమౌట్ ఉంటుంది. ఇన్నింగ్స్ సమయంలో ప్రతి జట్టుకు రెండున్నర నిమిషాల "వ్యూహాత్మక టైమౌట్" ఉంటుంది; బౌలింగ్ జట్టుకు ఆరు తొమ్మిది ఓవర్ల మధ్య, బ్యాటింగు జట్టు పదమూడు, పదహారు ఓవర్ల మధ్య తప్పనిసరిగా టైమౌట్లు తీసుకోవాలి. వ్యూహాత్మక టైమౌట్ ముగిసినట్లు సూచించడానికి, ఆన్-ఫీల్డ్ అంపైరు గాలిలో తన చేతిని పైకెత్తి రెండో చేత్తో మణికట్టుపై తడతాడు (గడియారాన్ని సూచిస్తూ). టైమౌట్‌ను జట్లు దుర్వినియోగం చేస్తున్నాయని అంపైర్లు గుర్తిస్తే పెనాల్టీ విధించవచ్చు.
2018 సీజన్ నుండి, అన్ని IPL మ్యాచ్‌లలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ను ఉపయోగిస్తున్నారు. ఇది ఆన్-ఫీల్డ్ అంపైరు నిర్ణయాన్ని సమీక్షించడానికి ప్రతి జట్టుకు ఇన్నింగ్స్‌లో రెండు అవకాశాలు ఉంటాయి. 2023 సీజన్ నుండి, ఆటగాళ్లు వైడ్‌లు, నో-బాల్‌లను కూడా సమీక్షించవచ్చు, ఇది ఇతర పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లలో ఉండదు.
బౌలింగ్ జట్టు తన ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే, మిగిలిన ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ పరిమితుల సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్‌లను మాత్రమే ఉంచవచ్చు లేదా మ్యాచ్ రిఫరీ ఆట తర్వాత బౌలింగ్ జట్టు కెప్టెన్‌ను శిక్షించవచ్చు. ఒక సీజన్‌లో మొదటి నేరంపై కెప్టెన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే 24 లక్షల రూపాయల జరిమానా, కెప్టెన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా జట్టు సభ్యులందరికీ 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% (ఏది తక్కువ అయితే అది) జరిమానా విధిస్తారు. అదే సీజన్‌లో మూడోసారి జట్టు స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేస్తే, కెప్టెన్‌ను తదుపరి మ్యాచ్‌కు సస్పెండ్ చేస్తారు. అలాగే అతనికి 30 లక్షల రూపాయల జరిమానా, జట్టులోని మిగిలిన వారికి ఒక్కొక్కరికి 12 లక్షలు లేదా 50% మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) జరిమానా విధిస్తారు. తదుపరి నేరాలకు ఈ జరిమానాలు అలాగే ఉంటాయి.
ముందే పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల జాబితా నుండి "ఇంపాక్ట్ ప్లేయర్"గా పేర్కొనబడే ఒక ఆటగాణ్ణి జట్లు ఉపయోగించవచ్చు. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు గాని, వికెట్ పడినప్పుడు గాని, బ్యాటర్ రిటైర్ అయినప్పుడు గాని, ఓవర్ చివరిలో గానీ ఆటగాణ్ణి మారచ్వచ్చు. ఈ నియమం ఫుట్‌బాల్, NBA నుండి తీసుకున్నారు. రెండు జట్లూ ఒక్కో మ్యాచ్‌కు చెఒకకసారి సబ్‌స్టిట్యూట్‌ని ప్రవేశపెట్టవచ్చు. ఒక బ్యాట్స్‌మన్ అవుట్ అయ్యినపుడు బౌలింగ్ జట్టు ఓవర్ మధ్యలో ఆట్గాణ్ణి మార్చాలని నిర్ణయించుకుంటే, అపుడు వచ్చే బౌలరు ఆ ఓవర్‌లోని మిగిలిన బంతులను వేయకూడదు. వెళ్ళిపోయే ఆటగాడు ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా కూడా మ్యాచ్‌లో పాల్గొనకూడదు. జట్టు తుది జాబితాలో నలుగురు కంటే తక్కువ విదేశీ ఆటగాళ్ళు ఉన్నట్లయితే, ప్రత్యామ్నాయంగా విదేశీ ఆటగాడిని పంపవచ్చు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ తన చేతులతో 'X సింబల్' చేయడం ద్వారా ఆటగాణ్ణి మారుస్తున్నట్లు సూచిస్తాడు.
ఒక మ్యాచ్‌లో పాల్గొనే జట్లు తమ ఆడే పదకొండు ఆటగాళ్ళ పేర్లను టాస్‌కు ముందు గాని, తర్వాత గానీ మ్యాచ్-రిఫరీకి ఇవ్వవచ్చు.
బౌలర్ బౌలింగు చేస్తూండగా, బంతి బ్యాట్స్‌మన్‌కి చేరే లోగా ఫీల్డరు గానీ, వికెట్ కీపరు గానీ అనుచితమైన కదలికలు చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు, ఆ బంతిని డెడ్ బాల్‌గా గుర్తిస్తారు.
ప్లేయింగ్ ఎలెవెన్‌లో జట్లు గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.
జట్లు తప్పనిసరిగా ఇరవై ఐదు మంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవాలి. అందులో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ళు ఉండవచ్చు.
జూన్ 2022 మీడియా-హక్కుల వేలంలో, స్కై స్పోర్ట్స్, వయాకామ్18 UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో ప్రసార హక్కులను పొందగా, టైమ్స్ ఇంటర్నెట్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, అమెరికా హక్కులను పొందింది. [80]
ఈ రోజుల్లో ఆటగాళ్లు భారత జట్టుకు ఆడటం లేదు గానీ, IPL లో మాత్రం అన్ని ఆటలనూ ఆడుతున్నారు అని కపిల్ దేవ్ అన్నాడు. ఈ లీగ్ కారణంగా భారత ఆటగాళ్లకు గాయాలు ఎక్కువయ్యాయని అతను పేర్కొన్నాడు. [86]