కాళయుక్తి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ 1918-1919, 1978-1979, 2038-39 ...ఇలా ప్రతీ 60 సంవత్సరాలకొకసారి వచ్చిన తెలుగు సంవత్సరానికి కాళయుక్తి అని పేరు.[1] ఇది 1918 ఏప్రిల్ 12 ఉగాది నుండి 1919 మార్చి 31 వరకు,[2] 1978 ఏప్రిల్ 8 ఉగాది[3] నుండి 1979 మార్చి 28 వరకు, ఇలా ప్రతీ 60 సంవత్సరాల కొకసారి ఉగాదితో ప్రారంభం అవుతుంది.
సంఘటనలు
మార్చు- 1918 : నవంబరు 11: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
- 1919 :మార్చి 15: తొలిసారిగా భారతీయ భాషలలో విద్యాబోధనకై హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించబడింది.
- 1919 :మార్చి 31: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
జననాలు
మార్చు- 1918 : మే 11: మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016)
- 1918 : జూలై 3: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974)
- 1918 : జూలై 4: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
- 1918 : జూలై 14: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007)
- 1918 : జూలై 18: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
- 1918 : జూలై 19: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007)
- 1918 : ఆగష్టు 10: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985)
- 1918 : ఆగష్టు 19: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి.
- 1918 : ఆగష్టు 21: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
- 1918 : ఆగస్టు 23: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- 1918 : ఆగస్టు 24: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1918 : అక్టోబరు 8: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006)
- 1918 : అక్టోబరు 8: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)
- 1918 : అక్టోబరు 12: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986)
- 1918 : నవంబర్ 8: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (మ.2007)
- 1918 : నవంబర్ 11: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
- 1918 : డిసెంబర్ 1: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
- 1918 : డిసెంబర్ 31: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, సాహితీవేత్త.
- 1978 : 03 ప్రముఖ పారిశ్రామికవేత్త సుంకర నాగ మోహన్
- 1978: మే 16: భారత అథ్లెటిక్స్ క్రీడాకారిణి సొమా బిశ్వాస్.
- 1978 : జూలై 25: తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయీస్ బ్రౌన్.
- 1978 : ఆగష్టు 16: మంత్రి కృష్ణమోహన్, 2013 కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత.
- 1978 : నవంబర్ 14:తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత.
మరణాలు
మార్చు- 1918 : సెప్టెంబర్ 8: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)
- 1918 : అక్టోబర్ 15: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835)
- 1978 : జనవరి 23: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)
- 1978 : మే 6: చిత్రా, చందమామ పత్రిక చిత్రకారుడు
- 1978 : జూన్ 6: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902)
- 1978 : జూన్ 27: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (జ.1901)
- 1978 : జూలై 8: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (జ.1899)
- 1978 : ఆగష్టు 6: పోప్ పాల్ VI, తన 80వ ఏట, తన వేసవి విడిది వద్ద గుండెపోటుతో మరణించాడు.
- 1978 : ఆగష్టు 21: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1917)
- 1978 : ఆగష్టు: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (జ.1896)
- 1979 : జనవరి 14: కేసనపల్లి లక్ష్మణకవి, సహజకవి, పండితుడు, విమర్శకుడు, పౌరాణికుడు. (జ.1902)
- 1979 : మార్చి 7: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890)
- 1979 : మార్చి 11: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (జ.1893)
మూలాలు
మార్చు- ↑ JSK. "మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?". telugu.webdunia.com. Retrieved 2021-04-17.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1919 Telugu Festivals, 1919 Telugu Calendar for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-17.
- ↑ "Telugu Calendar April, 1978 | ఎప్రిల్, 1978 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-17.