జానపద జాతర తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం నిర్వహించే జానపద ఉత్సవం. ఈ ఉత్సవంలో ఆగస్టు 22న ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 22 నుంచి ఆగస్టు 31 వరకు పది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో స్థానిక జానపద కళాకారులచే జానపద కళారూపాల ప్రదర్శనలు ఇవ్వబడుతాయి.[1]

2017 జానపద జాతర ముగింపు సమావేశం
2018 జానపద జాతర ముగింపు కార్యక్రమ వేదిక

రూపకల్పన

మార్చు

జన జీవనంలో, జాతి సాంస్కృతిక వారసత్వంలో అత్యంత కీలకమైన అభివ్యక్త రూపాలు జానపద కళారూపాలు. తెలంగాణ జానపద కళలకు తరగని ఖజానా అన్న ఈ విషయాన్ని పురస్కరించుకొని 2015 నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు జానపద జాతర అని పేరు పెట్టారు.

 
2018 జానపద జాతరలో కళాకారులు

2016, ఆగష్టు 22న నిజామాబాద్‌ లో జానపద జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 25 కళారూపాలకు చెందిన సుమారు 300మంది కళాకారులు జానపదం, చిందు యక్షగానం, బోనాలు, బతుకమ్మ, కోలాటం, బుర్రకథ, ఒగ్గుడోలు తదితర కళారూపాలతో ర్యాలీని నిర్వహించారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమం జరిగింది.[2]

 
2018 జానపద జాతరలో గోత్రాల భాగోతం కళాకారులతో మామిడి హరికృష్ణ
 
2019 జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో బుర్రకథ కళాకారుల ప్రదర్శన
 
2019 జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో కప్ప కావిడి కళారూపం ప్రదర్శన

2017లో తొలిసారిగా నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలతో కలిపి మొత్తం 31 జిల్లాల్లో జానపద జాతర నిర్వహించబడింది. నిజామాబాద్‌, జోగుళాంబ జిల్లాల్లో 2017, ఆగష్టు 22న ప్రారంభమై ఈ జాతర రాష్ట్రంలోని 31 జిల్లాలలో నిర్వహించబడి ఆగష్టు 31న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ముగిసింది.[3] ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, వడ్డేపల్లి శ్రీనివాస్‌ ఈ ముగింపు వేడుకలో రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, హైదరాబాదు జిల్లాల నుంచి దాదాపుగా 800 మంది కళాకారులు పాల్గొని కళాప్రదర్శనలు చేశారు.[4]

క్ర. సం. తేదీ జరిగిన ప్రదేశం/జిల్లా ప్రధానాంశం
01 ఆగష్టు 22 నిజామాబాదు జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ప్రారంభోత్సవ వేడుకలు
02 ఆగష్టు 23 నిర్మల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నల్లగొండ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా -
03 ఆగష్టు 24 జనగామ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబాబాదు జిల్లా -
04 ఆగష్టు 25 జగిత్యాల జిల్లా, పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా, మెదక్ జిల్లా, యాదాద్రి - భువనగిరి జిల్లా -
05 ఆగష్టు 26 ఖమ్మం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా -
06 ఆగష్టు 27 సూర్యాపేట జిల్లా, వనపర్తి జిల్లా, పెద్దపల్లి జిల్లా -
07 ఆగష్టు 28 మహబూబ్ నగర్ జిల్లా, కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా -
08 ఆగష్టు 29 సిద్ధిపేట జిల్లా, కొమరంభీం జిల్లా, నాగర్‌కర్నూల్ జిల్లా -
09 ఆగష్టు 31 రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వికారాబాదు జిల్లా, హైదరాబాదు జిల్లా రవీంద్రభారతిలో ముగింపు వేడుకలు

ఆగష్టు 31న హైదరాబాదులోని రవీంద్రభారతిలో 2019 జానపద జాతర కార్యక్రమం జరిగింది. ఈ జానపద జాతరలో వివిధ జిల్లాలలోని 42 జానపద, గిరిజన కళారూపాలకు చెందిన 1800 మంది కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు.[5] ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జానపద కళాకారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మూలాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "Janapada Jatara from tomorrow". thehindu.com. The HIndu. 21 August 2016.
  2. సాక్షి, ఈవెంట్స్ (24 August 2016). "జానపద జాతర". Archived from the original on 22 August 2018. Retrieved 22 August 2018.
  3. Telangana Today (31 August 2017). "Janapada Jatara helping folk artists earn livelihood". Retrieved 22 August 2018.
  4. తెలంగాణ మాగజైన్ (6 October 2017). "జనం మెచ్చిన జానపద జాతర". Retrieved 22 August 2018.
  5. నవతెంలగాణ, జాతర (10 September 2019). "తెలంగాణ సంస్కృ‌తీ సౌరభ తరంగం జానపద జాతర - 2019". NavaTelangana. Archived from the original on 10 సెప్టెంబరు 2019. Retrieved 10 September 2019.
"https://te.wiki.x.io/w/index.php?title=జానపద_జాతర&oldid=4351105" నుండి వెలికితీశారు