జిల్లా కలెక్టరు కార్యాలయం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భారత దేశంలోని భూభాగాన్ని అంతా జిల్లాలుగా విభజించారు. ప్రతీ జిల్లాను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసుల పరీక్షలలో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమిస్తారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా కలెక్టరు, జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాభావుంటారు. భారతదేశంలో రమారమిగా 500 జిల్లాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో జిల్లాకు ఒక కలెక్టరు (ఐ.ఎ.ఎస్. ఉత్తీర్ణులై 8 సంవత్సరాల అనుభవం సంపాదించిన వారిని జిల్లా కలెక్టర్లుగా నియమిస్తారు), మరొక జాయింటు కలెక్టరు (జె.సి క్లుప్తంగా) ఉంటాడు. జె.సి. కూడా ఐ.ఎ.ఎస్ ఉత్తీర్ణుడై, పరిపాలనా రంగంలో అనుభవం సంపాదించడానికి, జిల్లా కలెక్టరు అజమాయిషీలో, జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్కి అధిపతిగా ఉండి, ఆ రెవెన్యూ డివిజనును పాలిస్తాడు. ఆ పాలన లో, వచ్చేసమస్యలను, జె.సి. పరిష్కరించలేక పోతే, కలెక్టరు సలహాతో వాటిని పరిష్కరిస్తాడు. ఆ విధంగా భవిష్యత్తు కలెక్టర్లు రూపు దిద్దుకుంటారు. భారతదేశంలో ఉన్న జిల్లాలను మరలా రెవెన్యూ డివిజన్లుగా (రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్లు) విడదీసారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజనుకి ఒక్కొక్క ఐ.ఏ.ఎస్ (శిక్షణ కోసం) ఉంటాడు. ఆ విధంగా 500 జిల్లాలకు 500 మంది ఐ.ఏ.ఎస్ అధికార్లు, 1000 నుంచి 1200 రెవెన్యూడివిజన్లకి 1000 నుంచి 1200 మంది శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్. అధికార్లు మొత్తం 1500 నుంచి 1700 ఐ.ఏ.ఎస్ అధికార్లు భారత దేశంలోని జిల్లాల పరిపాలనలో ఉంటారు. ఒక రెవెన్యూ డివిజన్ అధికారి అజమాయిషీలో కొన్ని తహసీల్దారు కార్యాలయాలు వుంటాయి.
ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం విశాఖపట్నం జిల్లా కార్యాలయంలోని సమాచార హక్కు ఫలకాల ఆధారంగా ఇవ్వబడింది. ఇతర జిల్లాలవివరాలకు కొంత తేడా వుండవచ్చని గమనించండి.
జిల్లా నందలి ముఖ్య అధికారులు
మార్చు- కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్
- జాయింట్ కలెక్టర్ (IAS) -రెవెన్యూ & రైతు భరోసా
- జాయింట్ కలెక్టర్ (IAS) -అభివృద్ధి & VSVW
- జాయింట్ కలెక్టర్ - సంక్షేమం
- జిల్లా రెవెన్యూ అధికారి
- సబ్ కలెక్టర్ (IAS), రెవెన్యూ డివిజినల్ అధికారి
- కమీషనర్ (IAS), GVMC
- మెట్రోపాలిటన్ కమీషనర్ (IAS), VMRDA
- ప్రాజెక్ట్ డైరెక్టర్ (IAS) - ITDA
- ప్రాజెక్ట్ డైరెక్టర్ - సమగ్ర శిక్ష
- ప్రాజెక్ట్ డైరెక్టర్ - DRDA
- ప్రాజెక్ట్ డైరెక్టర్ - DWMA
- ప్రాజెక్ట్ డైరెక్టర్ - MEPMA
- జాయింట్ డైరెక్టర్ (వ్యవసాయ శాఖ)
- జాయింట్ డైరెక్టర్ (పశు సంవర్ధక శాఖ)
- జాయింట్ డైరెక్టర్ (మత్య్స శాఖ)
- జాయింట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమ శాఖ)
- డిప్యూటీ డైరెక్టర్ (ఖజానా శాఖ)
- డిప్యూటీ డైరెక్టర్ (గిరిజన సంక్షేమ శాఖ)
- అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ శాఖ)
- జిల్లా బిసి సంక్షేమ అధికారి
- జిల్లా పౌర సరఫరా అధికారి
- జిల్లా విద్యా శాఖాధికారి
- స్పెషల్ డెప్యూటీ కలెక్టరు
- అసిస్టెంట్ డైరెక్టరు (సర్వే, ల్యాండ్ రికార్డ్స్)
- జిల్లా పంచాయతీ అధికారి
- ముఖ్య ప్రణాళిక అధికారి
కార్యాలయంలోని విభాగాలు
మార్చు'బి' విభాగం
మార్చు- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు : హుజూరు హెడ్ క్లర్కు 'బి'.
- సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు : బి1, బి2, ఎ-10.
- సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు :బి3, బి5, బి7, జె-1, జె-2, జి1.
విధులు
మార్చు- ఎన్నికలు, జనాభా లెక్కలు.
- అన్య కార్యక్రమములు .
- పురపాలక సంఘములు.
- అతుకు బడులు.
- లీజులు (అద్దెలకు ఇవ్వటం).
- అగ్ని ప్రమాదములు.
- పాపరు దావాలు (దివాలా దావాలు).
- స్టాంపు డ్యూటీ.
- ప్రభుత్వ పరీక్షల నిర్వహణ.
- ఖాదీ గ్రామోద్యోగ బాకీల వసూళ్ళు.
'సి' విభాగం
మార్చు- సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు - సి1, సి4.
- సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు - సి2, సి3, సి5, సి6, సి7, సి8, ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5.
విధులు
మార్చు- చలన చిత్రముల చట్టము.
- ఆయుధముల చట్టము.
- ప్రేలుడు చట్టము (ప్రేలుడు పదార్ధములు)
- శాంతి భద్రతలు.
- కుల పరిశీలన - వక్ఫ్
- పెట్రోలియము చట్టము.
- ప్రవర్తన, పూర్వ చరిత్ర (వ్యక్తుల గురించిన ప్రవర్తన, వారి యొక్క పూర్వ చరిత్ర)
- రుణములు
- బర్మా కాందిశీకులు.
'డి' విభాగం
మార్చువిధులు
మార్చు- ఎస్టేటు రద్దు చట్టము 1941.
- అడవులు.
- ఆడిట్ అభ్యంతరాలు.
- టెలిఫోను, విద్యుత్తు.
- దేవాదాయము.
- ఈనాముల రద్దు చట్టము 1956.
- బట్వాడా.
'ఎఫ్' విభాగం - అక్కౌంట్లు
మార్చు- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుదు - హుజూర్ హెడ్ క్లర్కు,
- సిబ్బంది వివరములు - సీనియర్ - యు.డి.ఏ.
- సిబ్బంది వివరములు - జూనియర్లు - ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3, షరీఫ్
విధులు
మార్చు- సిబ్బంది వేతనములు తయారుచేయటం
- పెన్షనులు.
- సిబ్బంది టి.ఏ.లు (ట్రావెలింగ్ అలవెన్సులు అంటే ప్రయాణ భత్యాలు).
- గెజెటెడ్ సిబ్బంది (అధికార్లు) వేతనములు, టి.ఏ.లు.
- బడ్జెట్టు.
'జి' విభాగం - భూసేకరణ
మార్చు- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు. హుజూరు హెడ్ గుమాస్తా.
విధులు
మార్చు- నగరాభివృద్ధి సంస్థ
- జాతీయ రహదారి, ఆర్.టి.సి
- మార్కెట్లు - మార్కెట్ యార్డులు
- పారిశ్రామిక వాడలు
- విశాఖ డివిజనులోని ప్రత్యేక యూనిట్లు
- డివిజన్ల అధికారుల భూ సేకరణ వ్యవహారములు
అదనపు 'జి' విభాగం - పౌర సరఫరాలు (పట్టణ విభాగం)
మార్చు- పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 1 నుండి 7
'హెచ్' విభాగం - పౌర సరఫరాలు
మార్చు- సిబ్బంది వివరాలు. పర్యవేక్షకుదు - హుజూరు హెడ్ గుమాస్తా.
- సీనియర్ సహాయకులు - హెచ్2, హెచ్3, హెచ్10, హెచ్12
- జూనియర్ సహాయకులు - హెచ్4, హెచ్6, హెచ్7
విధులు
మార్చు- పౌర సరఫారాలు (గ్రామీణ ప్రాంతం).
- బియ్యం మిల్లుల చట్టము - 1958.
- నిత్యావసర వస్తువుల చట్టము - 1955
శుద్ధ ప్రతుల విభాగం
మార్చు- సిబ్బంది వివరములు - శుద్ధ ప్రతుల పర్యవేక్షకుడు.
- సిబ్బంది వివరములు - జూనియర్ సహాయకులు - డి.సి.1, డి.సి.2, డి.సి.3
విధులు
మార్చు- జిల్లా రాజపత్రముల (జిల్లా గెజెట్) ముద్రణ.
- రెవెన్యూ వ్యాపార పట్టిక.
- బట్వాడా (ఉత్తరములు బయటి కార్యాలయాలకు, వ్యక్తులకు, సంస్థలకు పంపింఛుట) (డిస్పాచ్ అంటారు).
జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో ఉన్న కార్యాలయాలు
మార్చు'జి' విభాగం - ఉప ఖజానా అధికారి
మార్చు- 280 - వైద్య ఆరోగ్యము.
- 287 - కార్మిక ఉద్యోగ వసతులు.
- 310 - పసు సంవర్ధక శాఖ.
- 313 - అడవుల శాఖ.
- 311 - పాడి పరిశ్రమ అభివృద్ధి.
- 333, 533 - నీటి పారుదల, వృద్ధాప్యపు పెన్షన్లు, వితంతు పెన్షన్లు.
'ఎఫ్' విభాగం - ఉప ఖజానాధికారి
మార్చు- 214 - న్యాయ శాఖ.
- 260 - అగ్నిమాపక శాఖ.
- 298 - సహకార శాఖ.
- 239 - స్టేట్ ఎక్సైజు శాఖ.
- 229 - సర్వే, సెటిల్‌మెంట్లు శాఖ.
- 255 - పోలీసు శాఖ.
నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ (NIC)
మార్చు- గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషనుకి చెందిన నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ పేరుతో ఒక గది ఉంది.ఇక్కడనుంచే జిల్లా తాలుకు వివరాలు, కంప్యూటరు ద్వారా, ఢిల్లీలోని NIC మెయిన్ సర్వర్ కి పంపుతారు.
అభివృద్ధి, ప్రణాళిక అధికారి విభాగం
మార్చు- అభివృద్ధి, ప్రణాళిక అధికారి విభాగము పేరుతో ఒక కార్యాలయం ఉంది.
- సిబ్బంది వివరములు : 1. సూపరింటెండెంట్. 2. సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు 3. జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు
- సిబ్బంది చేసే పనులు: తెలియవు.
మూలాలు
మార్చువనరులు
మార్చు- చిత్తూరు జిల్లా సమాచార హక్కు వివరాలు [1]