డోనా గంగూలీ
డోనా గంగూలీ (జననం 1977 ఆగస్టు 22) భారతీయ ప్రఖ్యాత ఒడిస్సీ నృత్యకారిణి. ఆమె గురువు కేలుచరణ్ మోహపాత్ర వద్ద నృత్య పాఠాలు నేర్చుకుంది. దీక్షా మంజరి అనే శిక్షణాలయం 2000లో స్థాపించిన ఆమె నాట్య శిక్షణ తరగతులు నిర్వహించడమేకాక తన బృందంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో నృత్యోత్సవాలు నిర్వహిస్తుంది. అంతేకాకుడా అమెరికా, ఇంగ్లండ్, చైనా, సింగపూర్, బంగ్లాదేశ్‌లలోనూ తరచూ ప్రదర్శనలు ఇస్తూవుంటారు.[1]
డోనా గంగూలీ | |
---|---|
జననం | డోనా రాయ్ 1977 ఆగస్టు 22 |
వృత్తి | ఒడిస్సీ నర్తకి |
దీక్షా మంజరి | |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1, సనా (కూతురు) |
తల్లిదండ్రులు |
|
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుడోనా రాయ్ 1977 ఆగస్టు 22న కోల్‌కాతాలోని బెహలాలో ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సంజీవ్ రాయ్, స్వప్న రాయ్. ఆమె లోరెటో కాన్వెంట్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది.[2]
కెరీర్
మార్చుడోనా గంగూలీ తన 3 సంవత్సరాల వయస్సులో అమలా శంకర్ వద్ద నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది. తరువాత ఆమె గురు గిరిధారి నాయక్ మార్గదర్శకత్వంలో ఒడిస్సీకి మారింది. కేలుచరణ్ మోహపాత్ర వద్ద డ్యాన్స్ పాఠాలతో ఒడిస్సీలో ప్రావీణ్యం సంపాదించింది.[3]
వ్యక్తిగతం
మార్చుదాదా అని భారతీయులంతా ముద్దుగా పిలుచుకునే క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి స్నేహితుడు. ఆమె తనని 1997లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సనా అనే కుమార్తె 2001లో జన్మించింది.[4]
దీక్షా మంజరి
మార్చుడోనా గంగూలీ 2000 సంవత్సరంలో కోల్‌కతా నగరంలో దీక్షా మంజరి అనే డ్యాన్స్ స్కూల్ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ చేతుల మీదుగా స్థాపించింది.[5] ఇది 2000లకు పైగా విద్యార్థుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందులో అభ్యాసకులు నాట్య శిక్షణ తరగతులేకాకుండా విభిన్న అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. డ్యాన్స్ కాకుండా, ఈ సంస్థలో యోగా, డ్రాయింగ్, కరాటే, స్విమ్మింగ్ వంటి ఇతర విభాగాలు ఉన్నాయి.[6] ఇక్కడ శిక్షణ పొందిన బృందంతో కలసి దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో నిర్వహించే నృత్యోత్సవాల్లో డోనా గంగూలీ ప్రదర్శనలిస్తుంది. అంతేకాకుండా అమెరికా, ఇంగ్లండ్, చైనా, సింగపూర్, బంగ్లాదేశ్‌లలో కూడా తరచూ ప్రదర్శనలు ఇస్తుంటారు. అక్టోబరు 2012లో డోనా గంగూలీ రవీంద్రనాథ్ ఠాగూర్ షాప్మోచన్‌కు నృత్య దర్శకత్వం వహించారు. ఇందులో డోనా గంగూలీతో పాటు తన గారాల పట్టి సనా గంగూలీ కూడా పాల్గొనడం విశేషం.[7]
మూలాలు
మార్చు- ↑ "Odissi Classical Dancer Chit Chat With Sakshi - Sakshi". web.archive.org. 2023-03-13. Archived from the original on 2023-03-13. Retrieved 2023-03-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Ode to Odissi". The Tribune. 10 July 2011. Retrieved 24 August 2012.
- ↑ "Dona Ganguly career". Dona Ganguly website. Archived from the original on 26 June 2012. Retrieved 24 August 2012.
- ↑ "Biography of Sourav Ganguly". Official website of Sourav Ganguly. Souravganguly.net. Archived from the original on 30 May 2008. Retrieved 19 May 2008.
- ↑ "Dance drama Chitrangada in city". Telegraph, Calcutta. 11 April 2012. Archived from the original on 3 February 2013. Retrieved 24 August 2012.
- ↑ "Disha Manjari website". Dona Gangul website. Archived from the original on 23 February 2012. Retrieved 24 August 2012.
- ↑ "Classical dance is eternal: Dona Ganguly". Times of India. 9 October 2012. Retrieved 9 October 2012.