సౌరవ్ గంగూలీ
1972 జూలై 8 న జన్మించిన సౌరవ్ గంగూలీ (Sourav Chandidas Ganguly) (Bengali: সৌরভ গাঙ্গুলী) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కోల్‌కతకు చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు ఉన్నాయి. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా అతనే. 2006 ప్రారంభంలో భారత జట్టునుంచి దూరమైననూ మళ్ళీ డిసెంబరులో జట్టులోకి ప్రవేశించి 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రతిభను నిరూపించాడు. 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ గతి నుండి రిటైర్ అయ్యారు. గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)కు ఐదేళ్లు, 2019 నుండి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సౌరవ్ చండీదాస్ గంగూలీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలకత్తా, పశ్చిమ బెంగాల్, , భారతదేశం | 1972 జూలై 8|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | దాదా, కొలకత్తా యువరాజు, బెంగాల్ టైగర్, మహారాజా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (1.80 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | లెఫ్ట్-హాండెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేయి (ఫాస్ట్ బౌలింగ్, మీడియం) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బాట్స్మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | స్వేహాశీష్ గంగూలీ (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 207) | 1996 జూన్ 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2008 6 నవంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 84) | 1992 జనవరి 11 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2007 15 నవంబర్ - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989/90–2006/07 | బెంగాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000 | లాంకషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005 | గ్లామొర్గాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006 | నార్తాంప్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–ప్రస్తుతం | కొలకత్తా నైట్ రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2008 15 నవంబర్ |
బాల్యం
మార్చుచండీదాస్, నిరూపా గంగూలీ దంపతులకు కనిష్ఠ పుత్రుడిగా 8జులై,1972 న కోల్ కతాలో గంగూలీ జన్మించాడు. అతని తండ్రి ముద్రణా వ్యాపారం చేసేవారు. అప్పట్లో కోల్ కతాలో అత్యంత ధనవంతుల్లో అతని తండ్రి ఒకరు. గంగూలీ బాల్యం విలాసవంతంగా గడిచింది. అప్పుడే అతనికి మహారాజా అని ముద్దు పేరు వచ్చింది. గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టం లేనప్పటికి అతని అన్నయ్య స్నేహశీష్ గంగూలీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆట కొనసాగించాడు . స్నేహశీష్ అప్పటికే మంచి పేరున్న ఎడమచేతి వాటం బెంగాల్ ఆటగాడు. నిజానికి గంగూలీ కుడిచేతి వాటం వాడు అయినప్పటికీ తన అన్న పరికరాలు ఉపయొగించుకోవడం కోసం ఎడమ చేతి వాటంతో సాధన మొదలు పెట్టాడు. బ్యాట్స్ మెన్ గా గంగూలీ అద్భుత ప్రతిభ కనపర్చటంతో అతనిని క్రికెట్ అకాడమీలో చేర్చారు. సౌరవ్, అతని అన్న కోసం వారి తండ్రి ఇంట్లోనే ఒక వ్యాయామశాల ఏర్పాటు చేయించారు. తొలినాళ్ళలో గంగూలీ ఎక్కువగా ఇంగ్లాడుకు చెందిన ఎడమ చేతి వాటం ఆటగాడు డేవిడ్ గోయర్ ఆటను తిలకించే వాడు. అండర్-15 జట్టు తరుపున ఒడిషా జట్టు మీద గంగూలీ సెంచురీ సాధించటంతో అతనిని సెయింట్ జేవియర్స్ పాఠశాల జట్టుకు నాయకుడిగా నియమించారు. అయితే అతని దుందుడుకు ప్రవర్తనతో విసిగిన అనేకమంది జట్టు సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది.
వ్యక్తిగతం
మార్చుఅతను భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి డోనా గంగూలీని వివాహం చేసుకున్నాడు. వారికి సన అనే కుమార్తె 2001లో జన్మించింది.[1]
అంతర్జాతీయ జీవితం
మార్చుఅరంగేట్రం
మార్చు1990-91 రంజీ సీజన్ లో అనేక పరుగులు సాధించటంతో వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కు గంగూలీ ఎంపిక అయ్యాడు. ఆడిన మొదటి ఆటలో కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆట పట్ల అతని తీరు మీద వచ్చిన విమర్శలతో జట్టులో స్ఠానం పోగొట్టుకున్నాడు. గంగూలీ తిరిగి దేశవాళీ క్రికెట్ 1993-94, 1994-95 సీజన్ లో అనేక పరుగులు సాధించాడు.1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 171 పరుగుకు సాధించటంతో తిరిగి జాతీయ జట్టుకు పిలుపు వచ్చింది. ఒకే వన్డే ఆడినప్పటికీ మొదటి టెస్టులో గంగూలీకి స్థానం లభించలేదు. అయితే అదే సమయంలో కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తో వివాదం ఏర్పడటంతో నవజ్యొత్ నిద్దూ యాత్ర నుండి విరమించుకున్నాడు. అలా రెండవ టెస్టులో రాహుల్ ద్రావిడ్ తో కలిసి గంగూలీ అరంగేట్రం చేయడం జరిగింది. ప్రఖ్యాత అంపైర్ డికీ బర్డ్ కు ఇదే చివరి టెస్టు. ఈ ఆటలో గంగూలీ సెంచురీ సాధించి లార్డ్స్ లో అరంగేట్రం లోనే సెంచురీ సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.లార్డ్స్ అరంగేట్రంలో అత్యధిక పరుగుల రికార్డు (131) ఇంకా గంగూలీ పేరు మీదే ఉంది. టెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తరువాతి ఆటలో మళ్ళీ సెంచురీ (136) సాధించటంతో క్రికెట్ చరిత్రలో అలా చేసిన కేవలం మూడవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ తో కలిసి భాగస్వామ్యంలో చేసిన 255 పరుగులు ఆ సమయానికి భారత్ తరుపున, భారత్ బయట ఏ వికెట్ కి అయినా ఏ దేశం పై అయినా అత్యధిక పరుగుల రికార్డు.
ఆడిన మ్యాచ్లు
మార్చుప్రతిపక్ష జట్టు ద్వారా టెస్ట్ మ్యాచ్ కెరీర్ ఆటతీరు | బ్యాటింగ్ గణాంకాలు | ||||
---|---|---|---|---|---|
ప్రతిపక్షం | మ్యాచ్లు | రన్లు | యావరేజ్ | అత్యధిక స్కొరు | 100 / 50 |
ఆస్టేలియా | 24 | 1403 | 35.07 | 144 | 2 / 7 |
బంగ్లాదేశ్ | 5 | 371 | 61.83 | 100 | 1 / 3 |
ఇంగ్ల్యండ్ | 12 | 983 | 57.82 | 136 | 3 / 5 |
న్యుజీలాండ్ | 8 | 563 | 46.91 | 125 | 3 / 2 |
పాకిస్తాన్ | 12 | 902 | 47.47 | 239 | 2 / 4 |
సౌత్ ఆఫ్ర్రికా | 17 | 947 | 33.82 | 87 | 0 / 7 |
శ్రీలంక | 14 | 1064 | 46.26 | 173 | 3 / 4 |
వెస్ట్ ఇండీస్ | 12 | 449 | 32.07 | 75* | 0 / 2 |
జింబబ్వె | 9 | 530 | 44.16 | 136 | 2 / 1 |
మొత్తం | 113 | 7212 | 42.17 | 239 | 16 / 35 |
ప్రతిపక్ష జట్టు ద్వారా వన్డే కెరీర్ ఆటతీరు | బ్యాటింగ్ గణాంకాలు | ||||
---|---|---|---|---|---|
ప్రతిపక్షం | మ్యాచ్లు | రన్లు | యావరేజ్ | అత్యధిక స్కొరు | 100 / 50 |
ఆస్టేలియా | 35 | 774 | 23.45 | 100 | 1 / 5 |
బంగ్లాదేశ్ | 10 | 459 | 57.37 | 135* | 1 / 4 |
ఇంగ్ల్యండ్ | 26 | 975 | 39.00 | 117* | 1 / 7 |
న్యుజీలాండ్ | 32 | 1079 | 35.96 | 153* | 3 / 6 |
పాకిస్తాన్ | 53 | 1652 | 35.14 | 141 | 2 / 9 |
సౌత్ ఆఫ్ర్రికా | 29 | 1313 | 50.50 | 141* | 3 / 8 |
శ్రీలంక | 44 | 1534 | 40.36 | 183 | 4 / 9 |
వెస్ట్ ఇండీస్ | 27 | 1142 | 47.58 | 98 | 0 / 11 |
జింబబ్వె | 36 | 1367 | 42.71 | 144 | 3 / 7 |
ICC World XI | 1 | 22 | 22.00 | 22 | 0 / 0 |
ఆఫ్రికా XI | 2 | 120 | 60.00 | 88 | 0 / 1 |
బెర్ముడా | 1 | 89 | 89.00 | 89 | 0 / 1 |
ఐర్లాండ్ | 1 | 73 | – | 73* | 0 / 1 |
కెన్యా | 11 | 588 | 73.50 | 111* | 3 / 2 |
నమీబియా | 1 | 112 | – | 112* | 1 / 0 |
నెథర్లాండ్స్ | 1 | 8 | 8.00 | 8 | 0 / 0 |
యూ.ఏ.ఈ | 1 | 56 | 56.00 | 56 | 0 / 1 |
మొత్తం | 311 | 11363 | 41.02 | 183 | 22 / 72 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Biography of Sourav Ganguly". Official website of Sourav Ganguly. Souravganguly.net. Archived from the original on 30 May 2008. Retrieved 19 May 2008.