దిగంబర్ భేగడే
దిగంబర్ బలోబా భేగడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మావల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
దిగంబర్ బలోబా భేగడే | |||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | రూపేఖా ధోరే | ||
---|---|---|---|
తరువాత | బాలా భేగాడే | ||
నియోజకవర్గం | మావల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1947 మహారాష్ట్ర | ||
మరణం | 2022 డిసెంబర్ 8 సోమత్నే ఫాటా | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుదిగంబర్ భేగడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఇండోరి గ్రామ ఉప సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మావల్ తాలూకా వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ సభ్యుడిగా, మావల్ తాలూకా బయింగ్ అండ్ సెల్లింగ్ యూనియన్ సభ్యుడిగా, మావల్ తాలూకా పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడిగా, భాజపా జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 1999 ఎన్నికలలో మావల్ శాసనసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి భేగాడే కృష్ణారావు ధొండిబాపై 16, 245 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి మదన్‌లాల్ హరక్‌చంద్ పై 3,312 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
మరణం
మార్చుదిగంబర్ భేగడే అస్వస్థతకు గురికావడంతో సోమత్నే ఫాటాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో 2022 డిసెంబర్ 8న మరణించాడు. ఆయనకు భార్య భాగుబాయి, కుమారులు మనోహర్, ప్రశాంత్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "BJP district unit gears up for polls". The Times of India. 22 March 2009. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "pune news former maval mla digambar bhegde passed away due to heart disease pune print news pam 03 zws 70". Loksatta. 8 December 2022. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
- ↑ "मावळचे माजी आमदार दिगंबर भेगडे यांचे हृदयविकाराने निधन; भाजपामध्ये मोठी पोकळी निर्माण". Maharashtra Times. 2022. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.