సంజయ్ విశ్వనాథ్ భేగాడే అలియాస్ బాల భేగాడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మావల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో కార్మిక, పర్యావరణం, ఉపశమనం, పునరావాసం, భూకంప పునరావాస శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

బాలా భేగాడే

పదవీ కాలం
2014 – 2019
తరువాత హసన్ ముష్రిఫ్
నియోజకవర్గం మావల్

పదవీ కాలం
2009 – 2019
ముందు దిగంబర్ భేగడే
తరువాత సునీల్ షెల్కే
నియోజకవర్గం మావల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
నివాసం తలేగావ్ దభడే, పూణే
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బాలా భేగాడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఎన్నికలలో మావల్ శాసనసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి బాపు జయవంతరావు భేగాడేపై 14,318 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి మౌలి దభాడేపై 28001 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2][3] దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో కార్మిక, పర్యావరణం, ఉపశమనం, పునరావాసం, భూకంప పునరావాస శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[4][5]

బాలా భేగాడే 2019 ఎన్నికలలో మావల్ శాసనసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి సునీల్ షెల్కే చేతిలో 93,942 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6] బాలా భేగాడే 2024 అక్టోబర్ 24న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు.[7][8]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  4. "Devendra Fadnavis expands cabinet, inducts ex-Congress leader Vikhe Patil". 4 June 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  5. "Maharashtra Cabinet: 13 ministers take oath of office" (in ఇంగ్లీష్). 17 June 2019. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  6. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  7. "BJP leader resigns, extends support to independent to defeat NCP nominee" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 25 October 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  8. "Maha: BJP leader quits as ally NCP announces candidate for Maval seat" (in ఇంగ్లీష్). 24 October 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.