ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయతను, తెలుగు నేటివిటీగా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతే ఇంతకు ముందు వచ్చిన, ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన రైతుబిడ్డ కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.

పాడిపంటలు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
విజయనిర్మల ,
జగ్గయ్య ,
కాంతారావు
కూర్పు కోటగిరి గోపాలరావు
భాష తెలుగు

పద్మాలయా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 'పాడి పంటలు ' తెలుగు చలన చిత్రం 1976 జనవరి,14 న సంక్రాంతి కానుకగా విడుదల.దర్శకుడు పందిళ్ళపళ్లి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య, అంజలీదేవి, జగ్గయ్య,కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పందిళ్లపళ్లి చంద్రశేఖరరెడ్డి

కధ: పి చంద్రశేఖరరెడ్డి

సంగీతం: కె. వి. మహాదేవన్

గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి,శ్రీరంగం శ్రీనివాసరావు, మోదుకూరి జాన్సన్,కొసరాజు రాఘవయ్య చౌదరి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి

మాటలు: త్రిపురనేని మహారధి

ఛాయా గ్రహణం: పుష్పాల గోపీకృష్ణ

కళ: కె.రామలింగేశ్వరరావు

కూర్పు: కోటగిరి గోపాలరావు

స్క్రీన్ ప్లే: జి.హనుమంతరావు

నిర్మాత: జి.ఆదిశేషగిరిరావు

నిర్మాణ సంస్థ: పద్మాలయా ఆర్ట్ పిక్చర్స్

విడుదల:14:01:1976.

చిత్రకథ

మార్చు

పాటలు

మార్చు
  1. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లయో - పి.సుశీల బృందం- రచన: ఆత్రేయ
  2. ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం- రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
  3. ఇరసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆచార్య ఆత్రేయ
  4. చేసుకుందాం గాల నైట్ వేసుకుందాం బ్లాక్ అండ్ వైట్ - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం- రచన: ఆత్రేయ
  5. నీతి న్యాయం మంచి మమత నీటిమీద రాతలురా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం- రచన: సింగిరెడ్డి నారాయణ రెడ్డి
  6. పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా రారండోయి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంబృందం - రచన: శ్రీశ్రీ
  7. మన జన్మభూమి బంగారుభూమి పాడిపంటలతో (మెరె దేశ్ కి ధరతీ (మహేంద్ర కపూర్) పాట ఆధారంతో) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం- రచన: మోదుకూరి జాన్సన్
"https://te.wiki.x.io/w/index.php?title=పాడిపంటలు&oldid=4386312" నుండి వెలికితీశారు