బద్వేలు

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని పట్టణం

బద్వేలు, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక పట్టణం.

బద్వేలు
బద్వేలు is located in ఆంధ్రప్రదేశ్
బద్వేలు
బద్వేలు
ఆంధ్రప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకడప
విస్తీర్ణం
 • Total42.15 కి.మీ2 (16.27 చ. మై)
Elevation
126 మీ (413 అ.)
జనాభా
 (2020)
 • Total1,15,000
 • జనసాంద్రత2,700/కి.మీ2 (7,100/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
516227
Vehicle registrationAP-04

పట్టణ చరిత్ర

మార్చు

మాట్ల కుమార అనంత కాలంలో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమంలో భద్రపల్లె అనే గ్రామం ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమంలో బద్దవోలు, బద్దెవోలు అయింది. ఇదియే నేటి బద్వేలు పట్టణం. మరొక కథనం ప్రకారం 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గాను, కాల క్రమాన నేటి 'బద్వేలు' గాను రూపాంతరం చెందిందని భావిస్తారు. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమైన నియోజకవర్గం.

రవాణా సౌకర్యాలు

మార్చు

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారం ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.

ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ఉత్పత్తులు

మార్చు

బద్వేలు ప్రాంతం సారవంతమైన మట్టికి ప్రసిద్ధి. అందులోనూ మట్టి పాత్రలు, కుండలకు ఎంతో పేరొందింది. పురాతనమైన బద్వేలు పట్టణంలోని కుమ్మరి కొట్టాలకూ ఒక ప్రత్యేకత ఉంది. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ బానలు, కుండలు, కూజాలు, కాగులు (ధాన్యం భద్రపరచుకునే పెద్ద పాత్రలు) ముంతలు, మూకుళ్లు తయారీ విక్రయంలో శతాబ్దాలుగా పేరొందింది. ఇక్కడ ఇప్పటికీ సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే మట్టి పాత్రలకు జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం సరిహద్దు గ్రామాల వరకు సరఫరా అవుతాయి. మట్టి పాత్రల పరిమాణం అనుసరించి ధర ఉంటుంది. వేసవిలో ఇక్కడి తయారయ్యే బానలను గిరాకీ ఎక్కువ. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టి పాత్రలను వంటలకు వినియోగిస్తున్నారు. కుండ, బాన, దుత్త (బిందె) లాంటివి ఎక్కువగా తయారు చేస్తుండటంతో ఈ వీధికి కుమ్మరి కొట్టాలు అని పేరొచ్చింది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
  • శివాలయం

మూలాలు

మార్చు
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
"https://te.wiki.x.io/w/index.php?title=బద్వేలు&oldid=4155513" నుండి వెలికితీశారు