బస్తీలో భూతం 1968, ఆగష్టు 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది పట్టణతిల్ భూతం అనే తమిళ సినిమానుండి డబ్ చేయబడింది. ఇది ది బ్రాస్ బాటిల్ అనే అమెరికన్ ఫాంటసీ కామెడీ చిత్రం ఆధారంగా మలచబడింది.

బస్తీలో భూతం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.వి.రామన్
తారాగణం జైశంకర్,
కె.ఆర్.విజయ,
నగేష్
సంగీతం గోవర్ధన్,
కె.ఎన్.రామసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ జే.వీ.
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎం.వి. రామన్
  • సంగీతం: ఆర్.గోవర్ధన్
  • మాటలు, పాటలు: అనిసెట్టి
  • ఛాయాగ్రహణం: రవికాంత్ నగాయిచ్
  • నిర్మాత: జావర్ వీరప్పన

తారాగణం

మార్చు

భాస్కర్, సీజర్ శీను ఇద్దరూ మిత్రులు. వీరికి ఒక పెద్ద కూజా బహుమతిగా లభిస్తుంది. దాని మూత తీసే సరిగి జింబోంబా అనే భూతం బయటికి వచ్చి తాను కింగ్ సాలమన్ కాలం నాటివాణ్ణని, 3000 సంవత్సరాల నిర్భందం నుండి విముక్తి కలిగించినందులకు వారికి ఏ ఉపకారమైనా చేస్తానని చెబుతాడు. వారు ఏం కోరుకుంటే అది పుట్టిస్తాడు. అతడు సృష్టించిన బంగారు కడ్డీలు చూసి ఓ స్మగ్లింగ్ ముఠా జింబోంబా కూడా స్మగ్లర్ అని భావించి అతణ్ణి, భాస్కర్‌ను వెంబడిస్తారు. భాస్కర్ ప్రియురాలు లత జింబోంబా సృష్టించిన అమ్మాయిని చూసి అసూయపడి వెళ్ళిపోతుంది. భాస్కర్ గోల పెడతాడు. భాస్కర్‌ను, లతని స్మగ్లింగ్ ముఠా ఎత్తుకుపోయి ఒక దీవి మధ్యలో ఉన్న భవనంలో బంధిస్తారు. అప్పుడు కానీ ఆమె తాను తెచ్చుకున్న ఆపదను గుర్తించదు. చివరకు భాస్కర్, సీను, అతని ప్రియురాలు సరోజ మహా సాహసంతో తప్పించుకుంటారు. చివరలో హెలీకాప్టర్‌తో యుద్ధంలో జింబోంబా కారు కూడా గాలిలో పైకెగిరి హెలీకాప్టర్‌ను ఢీ కొడుతుంది. ముఠా పరాజితమౌతుంది. భాస్కర్ తన ప్రేయసి లతని, శీను తన ప్రేయసి సరోజని పెళ్ళిచేసుకుంటారు[1].

మూలాలు

మార్చు
  1. రాధాకృష్ణ (30 August 1968). "చిత్ర సమీక్ష - బస్తీలో భూతం". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 21 March 2020.[permanent dead link]