భద్రం
భద్రం తెలుగు సినిమా హాస్య నటుడు, వైద్యుడు. ఆయన 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]
భద్రం | |
---|---|
జననం | భద్రం అక్టోబర్ 8 రాజమండ్రి , ఆంధ్రప్రదేశ్ , భారతదేశం |
వృత్తి | నటుడు, వైద్యుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2015 – ప్రస్తుతం |
బంధువులు | సోము వీర్రాజు |
జననం, విద్యాభాస్యం
మార్చుభద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జన్మించాడు. ఆయన తండ్రి గిరి యుగంధర్ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశాడు. ఆయన బెంగుళూర్లో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేశాడు. అతను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు సోము వీర్రాజుకు అల్లుడు.
వృత్తి జీవితం
మార్చుభద్రం హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్ (ఫిజియోథెరపిస్ట్) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు.[2]
సినీ ప్రస్థానం
మార్చుభద్రం డాక్టర్‌గా పనిచేస్తూ సినిమాలపై ఇష్టంతో ‘లవ్ పెయిన్’ పేరుతో మొదట చిన్న వీడియో చేశాడు. ఆయన అనంతరం ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీసి అందులో నటించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో అవకాశం ఇచ్చాడు.[3]
నటించిన సినిమాలు
మార్చు- జ్యోతిలక్ష్మీ (2014)
- ఊహలు గుస గుసలాడే (2014)
- రౌడీ ఫెలో (2014)
- చందమామ కథలు (2014)
- సూర్య వర్సెస్ సూర్య (2015)
- అరకు రోడ్ లో (2016)
- భలేభలే మగాడివోయ్
- గల్ఫ్ (2017)
- మహానుభావుడు (2017) - జిడ్డేశ్
- మిక్చర్ పొట్లం (2017)
- అమ్మాయిలంతే అదో టైపు (2017)
- జువ్వ (2018)
- ఇంటలిజెంట్ (2018)
- విజేత (2018)
- ఎందుకో ఏమో (2018)
- ఈ మాయ పేరేమిటో (2018)
- సుబ్రమణ్యపురం (2018)
- ఎన్.టి.ఆర్. కథానాయకుడు (2019)
- క్రేజీ క్రేజీ ఫీలింగ్ (2019)
- నేను నా నాగార్జున (2019)
- రాయలసీమ లవ్ స్టోరీ (2019)
- మిస్ మ్యాచ్ (2019)
- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
- గువ్వ గోరింక (2020)
- శతమానంభవతి
- మిస్టర్
- ఒక్క అమ్మాయి తప్ప
- లోఫర్
- ఎక్కడికిపోతావు చిన్నవాడా
- ప్రేమమ్
- పండగచేస్కో
- డిక్టేటర్
- వైశాఖం
- గల్ఫ్
- రణరంగం (2019)
- రాజ్‌దూత్ (2019)
- చావు కబురు చల్లగా (2021)
- బట్టల రామస్వామి బయోపిక్కు (2021)
- షాదీ ముబారక్ (2021)
- బంగారు బుల్లోడు (2021)
- ముగ్గురు మొనగాళ్లు (2021)
- టక్ జగదీష్ (2021)
- అర్జున ఫల్గుణ (2021)
- సూపర్ మచ్చి (2022)
- వర్జిన్ స్టోరి (2022)
- 69 సంస్కార్ కాలనీ (2022)
- జిన్నా (2022)
- ఊర్వశివో రాక్షసివో (2022)
- రాజయోగం (2022)
- గ్రంధాలయం (2023)
- రంగమర్తాండ (2023)
- కళ్యాణమస్తు (2023)
- నాతో నేను (2023)
- శబరి (2023)
- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (2023)
- ఉమాపతి (2023)
- బ్రీత్ (2023)
- సుందరం మాస్టర్ (2024)
- వి లవ్ బ్యాడ్ బాయ్స్ (2024)
- భీమా (2024)
- ఆ ఒక్కటీ అడక్కు (2024)
- నింద (2024)
- ధూం ధాం (2024)
వెబ్ సిరీస్
మార్చు- ఆహా నా పెళ్ళంట
- అతిధి (2023)
మూలాలు
మార్చు- ↑ Sakshi (21 October 2017). "డాక్టర్ టు యాక్టర్". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
- ↑ Sakshi (18 July 2020). "డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయ్యాడు 'భద్రమ్"". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
- ↑ Sakshi (18 September 2014). "భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.