వి లవ్ బ్యాడ్ బాయ్స్

వి లవ్ బ్యాడ్ బాయ్స్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మించిన ఈ సినిమాకు రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 22న[2], ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేసి, సినిమాను మార్చి 8న విడుదలైంది.

వి లవ్ బ్యాడ్ బాయ్స్
దర్శకత్వంరాజు రాజేంద్ర ప్రసాద్
రచనరాజు రాజేంద్ర ప్రసాద్
నిర్మాతపప్పుల కనకదుర్గారావు
తారాగణంఅజ‌య్ క‌ర్తుర్వ‌ర్‌
వంశీ ఏకశిరి
ఆదిత్య శశాంక్ నేతి
ఛాయాగ్రహణంవి.కె.రామరాజు
కూర్పునందమూరి హరి
సంగీతంరఘు కుంచే
భూషణ్ జాన్
నిర్మాణ
సంస్థ
బి.ఎమ్.క్రియేషన్స్
విడుదల తేదీ
8 మార్చి 2024 (2024-03-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్‌మేట్స్ పైగా మంచి స్నేహితులు. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం వెతుకుతున్న సమయంలో దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడతారు. ఆ తరువాత జ‌రిగిన ప‌రిణామాల‌తో వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుక‌న్నాయ‌నేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: బి.ఎమ్.క్రియేషన్స్
  • నిర్మాత:పప్పుల కనకదుర్గారావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్రసాద్
  • సంగీతం: రఘు కుంచే, భూషణ్ జాన్
  • సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు
  • ఎడిటర్: నందమూరి హరి
  • పాటలు: భాస్కరభట్ల, శ్రీమన్నారాయణాచార్య
  • గాయకులు: రఘు కుంచే, గీతా మాధురి, లిప్సిక, అరుణ్ కౌండిన్య, మనోజ్ శర్మ కుచి
  • అడిషనల్ స్క్రీన్ ప్లే & మాటలు: ఆనంద్ కొడవటిగంటి

మూలాలు

మార్చు
  1. ABP Desham (14 February 2024). "ఇది ఫస్ట్ లుక్ కాదు, ఫుల్ లుక్ - ప్రేమికుల రోజున 'వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  2. NT News (23 February 2024). "నేటి యువత మెచ్చేలా." Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  3. Sakshi (8 March 2024). "'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  4. NTV Telugu (8 March 2024). "'వి లవ్ బ్యాడ్ బాయ్స్' మూవీ రివ్యూ". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.

బయటి లింకులు

మార్చు