మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం

ధ్యాన్ చంద్ ఖేల్ రత్న
(రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న నుండి దారిమార్పు చెందింది)

ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం, భారత దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. భారత మాజీ ప్రధాని కీ.శే. రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92 లో ఈ పురస్కారం ప్రారంభింపబడింది. ఒక ప్రశంసాపత్రం, ఒక పతకం, నగదు ఈ పురస్కారం లోని భాగాలు.

ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం ఫౌర
విభాగం క్రీడా పురస్కారం వ్యక్తిగతం లేదా జట్టుకు
వ్యవస్థాపిత 1991–1992
మొదటి బహూకరణ 1991–1992
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి 750,000
వివరణ భారతదేశంలో అత్యధిక క్రీడా గౌరవం
మొదటి గ్రహీత(లు) విశ్వనాథన్ ఆనంద్
క్రితం గ్రహీత(లు) యోగేశ్వర్ దత్, Vijay Kumar
Award Rank
none ← ధ్యాన్ చంద్ ఖేల్‌రత్నఅర్జున అవార్డు

ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్‌వెల్త్ క్రీడల్లో గాని, బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్, చదరంగం వంటి క్రీడల్లో గానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారునికి లేక జట్టుకు ఈ పురస్కారం ఇస్తారు. సాధారణంగా, పురస్కారం ప్రకటించేందుకు ఒక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు కనబరచిన ప్రదర్శనలను లెక్కిస్తారు. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పురస్కార విజేతను నిర్ణయించేందుకు క్రీడలతో సంబంధమున్న వారితో కూడిన ఒక బృందాన్ని నియమిస్తుంది. ఏదైనా సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధంగా లేవని ఎంపిక బృందం భావిస్తే ఆ ఏటికి పురస్కార ప్రధానం జరగదు.

ఖేల్ రత్న పురస్కారం 1991 నుండి 2021 వరకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరిట రాజీవ్ గాంధీ చంద్ ఖేల్‌రత్న పురస్కారం అని ఉండేది. 2021 ఆగస్టు 6 న దీని పేరును ప్రముఖ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పేరిట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం అని మార్చారు.

ఇప్పటివరకు ఈ పురస్కారం వేరు వేరు విభాగాలకు చెందిన ఇద్దరేసి క్రీడాకారులకు సంయుక్తంగా రెండు సార్లు ప్రధానం చేయగా, 1993-94 లో మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్క మారు మాత్రమే క్రీడా జట్టుకు పురస్కారం లభించింది. ఈ పురస్కారంలో నగదు బహుమతి 1991-92 లో లక్ష రూపాయిలు, 2000-01 లో మూడు లక్షల రూపాయిలు, 2004-05 నాటికి అయిదు లక్షల రూపాయిలు ఉంది.

అర్జున పురస్కారానికీ, ఈ పురస్కారానికి మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమనగా - అర్జున పురస్కారాన్ని ప్రతి క్రీడలోని ఉత్తమ క్రీడాకారునికి ఇస్తారు. కానీ ఈ పురస్కారం మాత్రం క్రీడాకారులందరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే ఇస్తారు. ఖేల్ రత్న అను హిందీ పదానికి క్రీడారత్నమని అర్థం.

పురస్కార విజేతలు

మార్చు
అవార్డు గ్రహీతల జాబితా
సంవత్సరం స్వీకర్తలు క్రీడా విభాగం రెఫరెన్స్.
1991–1992 విశ్వనాథన్ ఆనంద్ చదరంగం
1992–1993 గీత్ సేథి బిలియర్డ్స్
1993–1994 # హోమీ మోతీవాలా యాటింగ్ (టీమ్ ఈవెంట్)
పుష్పేంద్ర కుమార్ గార్గ్ యాటింగ్ (టీమ్ ఈవెంట్)
1994–1995 కర్ణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్
1995–1996 కుంజరాణి వెయిట్ లిఫ్టింగ్
1996–1997 లియాండర్ పేస్ టెన్నిస్
1997–1998 సచిన్ టెండుల్కర్ క్రికెట్
1998–1999 జ్యోతిర్మయి సిక్దర్ అథ్లెటిక్స్
1999–2000 ధనరాజ్ పిళ్లే హాకీ
2000–2001 పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్
2001 అభినవ్ బింద్రా షూటింగ్
2002 # కె.ఎం. బీనామోల్ అథ్లెటిక్స్
అభినవ్ భింద్ర షూటింగ్
2003 అంజు బాబీ జార్జ్ అథ్లెటిక్స్
2004 రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ షూటింగ్
2005 పంకజ్ అద్వానీ బిలియర్డ్స్ మరియు స్నూకర్
2006 మానవ్‌జిత్ సింగ్ సంధు షూటింగ్
2007 మహేంద్ర సింగ్ ధోని క్రికెట్
2008 అవార్డు లేదు
2009 # మేరీ కోమ్ బాక్సింగ్
విజేందర్ సింగ్ బాక్సింగ్
సుశీల్ కుమార్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్
2010 సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్
2011 గగన్ నారంగ్ షూటింగ్
2012 # విజయ్ కుమార్ షూటింగ్
యోగేశ్వర్ దత్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్
2013 రోంజన్ సోధి షూటింగ్
2014 అవార్డు లేదు
2015 సానియా మీర్జా టెన్నిస్
2016 # పివి సింధు బ్యాడ్మింటన్
దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్
జితూ రాయ్ షూటింగ్
సాక్షి మాలిక్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్
2017 # దేవేంద్ర ఝఝరియా పారాలింపిక్ జావెలిన్
సర్దారా సింగ్ హాకీ
2018 # సాయిఖోమ్ మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్
విరాట్ కోహ్లీ క్రికెట్
2019 # దీపా మాలిక్ పారాలింపిక్ ( షాట్ పుట్ , జావెలిన్ , ఇతరులు)
బజరంగ్ పునియా ఫ్రీస్టైల్ రెజ్లింగ్
2020 # రోహిత్ శర్మ క్రికెట్
మరియప్పన్ తంగవేలు పారాలింపిక్ హై జంప్
మానికా బాత్రా టేబుల్ టెన్నిస్
వినేష్ ఫోగట్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్
రాణి రాంపాల్ హాకీ
2021 # నీరజ్ చోప్రా అథ్లెటిక్స్
రవి కుమార్ దహియా ఫ్రీస్టైల్ రెజ్లింగ్
లోవ్లినా బోర్గోహైన్ బాక్సింగ్
పి.ఆర్. శ్రీజేష్ హాకీ
అవని ​​లేఖా పారాలింపిక్ షూటింగ్
సుమిత్ ఆంటిల్ పారా-అథ్లెటిక్స్
ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్
కృష్ణా నగర్ పారా బ్యాడ్మింటన్
మనీష్ నర్వాల్ పారాలింపిక్ షూటింగ్
మిథాలీ రాజ్ క్రికెట్
సునీల్ ఛెత్రి ఫుట్బాల్
మన్‌ప్రీత్ సింగ్ హాకీ
2022 ఆచంట శరత్ కమల్ టేబుల్ టెన్నిస్
2023 # చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ [1]
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి బ్యాడ్మింటన్ [1]
2024 # దొమ్మరాజు గుకేష్ చదరంగం [2]
హర్మన్‌ప్రీత్ సింగ్ హాకీ [3]
ప్రవీణ్ కుమార్ పారా-అథ్లెటిక్స్ [3]
మను భాకర్ షూటింగ్ [3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "'ఖేల్‌రత్న'కు సాత్విక్‌!". Andhrajyothy. 14 December 2023. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.
  2. "ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి". Eenadu. 17 January 2025. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.
  3. 3.0 3.1 3.2 "నలుగురు 'ఖేల్‌ రత్న'లు". Sakshi. 3 January 2025. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.

ఇతర లింకులు

మార్చు