Noothi venkat గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
వికీపీడియా నేమ్‌స్పేస్ కు సంబంధించిన చాలా పేజీలకు అడ్డదారులుంటాయి. ఇవి సాధారణంగా WP: తో ప్రారంభమౌతుంటాయి. ఉదాహరణకు రచ్చబండకు వెళ్ళాలంటే సర్చ్ బాక్స్ లో WP:VP అని ఎంటర్ చేస్తే సరి.
నేను తెవికి చాలా రోజుల నుండి చూస్తున్నాను. కానీ తెలుగులో ఎలా టైపు చేయాలో తెలియ లేదు. కంప్యూటర్ ఎరా చూడ్డం వల్ల తెలిసింది. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది. 4 టిల్డేలతో సంతకం ఎలా చేయాలి ? దయచేసి ఎవరయినా తెలుప గలరు?
నూతి వెంకటేశం గారూ! మీకు తెలుగు వికీ నచ్చినందుకు, మీరు సభ్యులుగా చేరినందుకు చాలా సంతోషం. స్వాగతం. ఉత్సాహంగా మీకు ఆసక్తి ఉన్న విషయాలపై రచనలు చేసి తెలుగు వికీ ప్రగతికి మరింత తోడ్పడుతారని ఆశిస్తున్నాను. మీరు సంతకం సరిగ్గానే చేసినట్లున్నారు. (1) మీ కీబోర్డులో ఎడమవైపు ట్యాబ్ కీ కి పైన ఉన్న "టిల్డే" కీని నాలుగు సార్లు నొక్కవచ్చును. లేదా ఈ ఎడిట్ బాక్సు పైన ఉన్న గుర్తులలో ఎడమవైపునుండి పదవ గుర్తును నొక్కవచ్చును. --కాసుబాబు13:39, 19 మే 2009 (UTC)Reply