సుశీల్ కుమార్ మోడీ
సుశీల్ కుమార్ మోడీ ( 1952 జనవరి 5 - 2024 మే 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2005 నుండి 2020 వరకు బీహార్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, [1] మాజీ ఉపముఖ్యమంత్రిగా పనిచేసి 2020 డిసెంబరు నుండి బీహార్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.
సుశీల్ కుమార్ మోడీ | |||
![]()
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2020 డిసెంబరు 7 – 2024 ఏప్రిల్ 2 | |||
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బీహార్ | ||
పదవీ కాలం 2017 జులై 27 – 2020 నవంబరు 16 | |||
ముందు | తేజస్వి యాదవ్ | ||
తరువాత | రేణు దేవి, తార్ కిషోర్ ప్రసాద్ | ||
పదవీ కాలం 2005 నవంబరు 24 – 2013 జూన్ 16 | |||
ముందు | కర్పూరి ఠాకూర్ | ||
తరువాత | తేజస్వి యాదవ్ | ||
ఆర్ధిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2017 జులై 27 – 2020 నవంబరు 16 | |||
ముందు | అబ్దుల్ బారి సిద్దిక్వి | ||
తరువాత | తార్ కిషోర్ ప్రసాద్ | ||
పదవీ కాలం 2005 నవంబరు 24 – 2013 జూన్ 16 | |||
ముందు | రబ్రీ దేవి | ||
తరువాత | నితీష్ కుమార్ | ||
ప్రతిపక్ష నేత, బీహార్ శాసనమండలి
| |||
పదవీ కాలం 2013 జూన్ 19 – 2017 జులై 27 | |||
తరువాత | రబ్రీ దేవి | ||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2006 మే 7 – 2020 డిసెంబరు 11 | |||
తరువాత | సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | ||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2005 | |||
ముందు | సుబోధ్ రే | ||
తరువాత | సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | ||
నియోజకవర్గం | భాగల్‌పూర్ నియోజకవర్గం | ||
ప్రతిపక్ష నేత
| |||
పదవీ కాలం 1996 మార్చి 19 – 2004 మార్చి 28 | |||
ముందు | యశ్వంత్ సిన్హా | ||
తరువాత | ఉపేంద్ర కుష్వాహా | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1990 – 2004 | |||
ముందు | అక్విల్ హైదర్ | ||
తరువాత | అరుణ్ కుమార్ సిన్హా | ||
Constituency | పాట్నా సెంట్రల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాట్నా, బీహార్, భారతదేశం | 5 జనవరి 1952||
మరణం | 13 మే 2024 పాట్నా, బీహార్, భారతదేశం | (aged 72)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | జెస్సీ జార్జ్ (1986) | ||
సంతానం | 2 | ||
నివాసం | పాట్నా, బీహార్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | పాట్నా యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుసుశీల్ కుమార్ మోదీ జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని ఉద్యమంలో చేరాడు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బిహార్‌లోని కుంహార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో భగల్పుర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. సుశీల్ కుమార్ మోదీ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాసవాన్ మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2024 ఏప్రిల్ 2న ఆయన పదవీకాలం ముగిసింది.
నిర్వహించిన స్థానాలు
మార్చుకాలం | పదవులు |
---|---|
1973–1977 | జనరల్ సెక్రటరీ, పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ |
1983–1986 | అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి |
1995–1996 | కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ |
1990–2004 | పాట్నా సెంట్రల్ నుండి బీహార్ శాసనసభ సభ్యుడు |
1996–2004 | బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు |
2000 | పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి |
2004–2005 | భాగల్పూర్ నుండి లోక్ సభ సభ్యుడు |
2006–2020 | బీహార్ లెజిస్లేట్ కౌన్సిల్ సభ్యుడు |
2005–2013 | బీహార్ ఉప ముఖ్యమంత్రి & బీహార్ ఆర్థిక మంత్రి |
2013–2017 | బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు |
2017–2020 | బీహార్ ఉప ముఖ్యమంత్రి & బీహార్ ఆర్థిక మంత్రి |
2020 డిసెంబరు 7 - 2024 ఏప్రిల్ 2 | రాజ్యసభ సభ్యుడు |
మరణం
మార్చుసుశీల్ కుమార్ మోదీ క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మే 13న రాత్రి మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Bihar elections: Sushil Modi tops BJP's list of CM probables". Archived from the original on 11 July 2015.
- ↑ Andhrajyothy (14 May 2024). "బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
- ↑ The Hindu (13 May 2024). "Sushil Modi, former Bihar Deputy Chief Minister, dies at 72 after battling with cancer" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.