హైదరాబాదు సంస్కృతి
అనేక వర్గాల ప్రజలు, జీవన విధానాలు, చారిత్రిక ప్రభావాల వలన హైదరాబాదు సంస్కృతి తక్కిన నగరాలకంటే కొంత విలక్షణతను సంతరించుకొంది. చారిత్రికంగా ఇది ముస్లిమ్ రాజుల పాలనలో ఉన్న హిందూ, ముస్లిం జనుల ప్రాంతం. కనుక తెలుగు, ఉర్దూ బాషల కలగలుపు గణనియంగా జరిగింది. అంతే కాకుండా ఇటీవల ఇతర ప్రాంతాలనుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన జనుల కారణంగా ఇది మరింత సంపన్నమైంది.
భాష
మార్చుహైదరాబాదు ఉర్దూ, హిందీ, తెలుగు, మరాఠీ, కన్నడ మొదలగు భాషల మిశ్రమం వల్ల కొన్ని ప్రత్యేకమైన పదాలు హైదరాబాదు పదాలుగా ప్రసిద్ధి చెందినాయి. ముఖ్యముగా ఇతర తెలుగు ప్రాంతములనుండి హైదరాబాదునకు క్రొత్తగా వచ్చేవారికి ఇవి కొంచెం వింతగా, ఇబ్బందిగా వినపడతాయి.
- చటాక్ : దీనికి అర్థము 50 గ్రాములు, దీనిని ముఖ్యముగా దుకాణములలో (కొట్లలో, అంగళ్ళలో) వాడతారు! మరీ ముఖ్యముగా పూల దుకాణములలో, కూరగాయల దుకాణములలో వాడతారు
- చల్తా హై : సరదగా తీసుకో! (టేక్ ఇట్ ఈజీ) కి ప్రత్యామ్నాయంగా వాడతారు
- కైకూ : ఎందుకు అనుటానికి వాడతారు
- నక్కొ : లేదు, వద్దు అనడానికి వాడతారు
- ఉత్తా/ఇత్తా/కిత్తా: ఉత్నా/ఇత్నా/కిత్నా (అంత/ఇంత/ఎంత)
- మేరా కో : నాకు
- నల్లా : నీటి పంపు
- ఉత్రో : (లేదా ఉతార్) - ఇది ముఖ్యముగా సిటీ బస్సులలో వాడతారు, దీనికి అర్థము దిగు, క్రిందికి దిగు. ( గమనిక : :తమిళములో ఉకార్ ఉంటే కూర్చోండి అని అర్థము, తిరుపతి పరిసరాలలో ఇది చాలా ఎక్కువగా వాడే తెలుగు పదం లాంటిది, అలాగే ద్రావిడ వేదం చదివే వైష్ణవాలయాలలో కూడా "ఉక్కార్" అని అంటూ ఉంటారు)
- తోడము : కొంచము
- పరేషాన్: ఆదుర్దా (హిందీ మూలం)
- సమఝ్ అయినాది?: అర్థం అయ్యిందా?
- పోరి: అమ్మాయి
- పోరడు/పోరగాడు: అబ్బాయి
- చెండు: బాల్, బంతి
- నఖరాలు: వగలు
- బొక్కలు: ఎముకలు
- బాంచెన్ కాల్మొక్త: బానిసను, కాళ్ళు మొక్కుతాను
- యాద్ కి ఒస్తలేదు: జ్ఞాపకం రావట్లేదు
- గంత/గింత: అంత/ఇంత
- దేవులాడు: వెదుకు (ఇది సీమలో కూడా ఉంది)
- ఆవారా గాడు: తిరుగుబోతు
- పాగల్ గాడు: పిచ్చివాడు
- దమాక్ కరాబ్: పిచ్చి ఎక్కుట (దిమాక్ ఖరాబ్)
ఆహారం
మార్చురాష్ట్రంలో మిగతా ప్రదేశాలకంటే హైదరాబాదులో టీ సేవనం ఎక్కువ. టీ సేవనం తోనే హైదరాబాదీయుల దినచర్య ఆరంభం అవుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. పొరలు పొరలుగా ఉండే "టాయ్-బిస్త్" అనే ఒక రకమైన బిస్కెట్టుని టీ లోకి ఇష్టపడతారు. ఇక్కడి ప్రజల దైనందిక జీవితంలో ఉదయం అల్పాహారానికి సమయం ఉండకపోవటం వలన, చాలా మంది ఉద్యోగులు ఉదయం టాయ్-బిస్త్, టీతో సరిపెట్టుకుంటారు, లేదా మిత భోజనం చేసి కార్యాలయాలకి వస్తారు. గృహిణులు సాధారణంగా ఇంటి పనిని ముగించుకొని 11.00 గంటల ప్రాంతంలో సరాసరి భోంచేస్తారు.
ఉత్సవాలు, ప్రదర్శనలు
మార్చు- బోనాలు
సినిమాలు, నాటకాలు, ముషాయిరీలు
మార్చు- హైదరాబాదీలకు సినిమా ప్రధాన ప్రవృత్తి. శని ఆదివారాలలో నగరంలో అన్ని థియేటర్లు, మల్టీప్లెక్సులు నిండి పోతాయి.
మతం
మార్చుకులం
మార్చువ్యాపారం
మార్చురాజకీయాలు
మార్చు~''నిజాం కాలంలో దలిత ఉధ్యమలు
నిర్మాణాలు
మార్చువృత్తులు
మార్చువస్త్ర ధారణ, ఆభరణాలు
మార్చుజీవన సరళి
మార్చు- విద్యార్థినీ విద్యార్థులు, యువత బస్సులని కేవలం స్టాపులలోనే కాకుండా రోడ్డు మలుపుల వద్ద, స్పీడ్ బ్రేకర్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద కదులుతున్నప్పుడు కూడా అవలీలగా ఎక్కటం దిగటం చేస్తుంటారు. ఫుట్ బోర్డు పైనున్న వారు వీరికి సహకరిస్తుంటారు. ఇది కొన్ని సార్లు ప్రమాదానికి కూడా దారి తీసిన దాఖలాలు ఉన్నాయి.
ఇతరాలు
మార్చువివాహాలలో హైదరాబాదులో పై కప్పులేని కారులని పూలతో అలంకరించి వధూవరులని అందులో బ్యాండు మేళంతో ఊరేగిస్తారు.